32,000 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

By

32,000 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

కువైట్ సిటీ: ప్రస్తుత సంవత్సరం మొదటి పది నెలల్లో అవసరమైన షరతులు లోబడి ఉండకపోవడం లేదా అక్రమంగా పొందిన 32,000 డ్రైవింగ్ లైసెన్స్‌లను ప్రవాసీల నుండి ఉపసంహరించుకున్నారు. అలాగే మానసిక పరిస్ధితి సరిగా లేని 2,400 కువైటీ పౌరుల డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉపసంహరించకున్నారు, వీరిలో కొంతమందికి దృష్టి వైకల్యాలు ఉన్నాయి, వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు.

 

జనవరి నుండి అక్టోబర్ 2021 చివరి వరకు కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో 43% తగ్గుదల ఉంది. 72,000 డ్రైవింగ్ లైసెన్స్‌ల నుండి ఈ సంఖ్య 41,000కి పడిపోయిందని అల్ రాయ్ నివేదించింది. నివాస వ్యవహారాలు, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ మరియు అథారిటీ ఫర్ డిసేబుల్డ్ వంటి ఇతర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో లింక్ చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌లను ప్రత్యేకంగా జారీ చేయడంలో డిపార్ట్‌మెంట్ కఠినంగా వ్యవహరిస్తుందని జనరల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన కల్నల్ నవాఫ్ అల్-హయాన్ తెలిపారు.

 

చదువు పూర్తైన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రవాస విద్యార్థులు వారి లైసెన్స్‌ లను బ్లాక్ లో పెట్టారు. అలాగే వృత్తిని మార్చుకున్న లేదా షరతులు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేశారు. వారు తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేస్తే తప్ప నివాస అనుమతులు పునరుద్ధరించబడవు

Leave a Comment

Your email address will not be published.

You may also like