నఖిలీ వీసాలతో కువైట్ వస్తున్న 44 మంది మహిళలు అరెస్ట్..

By
నఖిలీ వీసాలతో కువైట్ వస్తున్న 44 మంది మహిళలు అరెస్ట్..
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి నఖిలీ వీసాల ముఠా బాగోతం వెలుగుచూసింది. ఏకంగా 44 మంది మహిళలను నఖిలీ వీసాలతో కువైట్‌ పంపేందుకు ఓ ముఠా యత్నించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళా ప్రయాణికులు కువైట్‌ వచ్చేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా వీరిలో కొందరు ఆందోళనతో కనిపించారు. వారి వద్ద ఉన్న పత్రాలు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్‌పోర్టు ఇమిగ్రేషన్‌ అధికారులు లోతుగా విచారించగా. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. మహిళల వద్ద ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ వీసా, విజిట్‌ వీసాలు నఖిలీవని తేలడంతో అధికారులు మహిళలందరినీ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నఖిలీ వీసాల దందాలో హైదరాబాద్‌, చెన్నైకి చెందిన కొందరు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

Source : Facebook Viral

Leave a Comment

Your email address will not be published.

You may also like