కడప పోలీసు కుటుంబాలకు అందుబాటులో అత్యాధునిక అంబులెన్సు

  • కడప పోలీసు కుటుంబాలకు అందుబాటులో అత్యాధునిక అంబులెన్సు ..
  • అంబులెన్సు సౌకర్యాలను పరిశీలించిన జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు
  • పోలీసు సంక్షేమానికి పెద్ద పీట.
    జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్
    కడప జిల్లాలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా ఆక్సిజన్ సౌకర్యం తో పాటు ఇతర అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన అంబులెన్సును అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్.పి గారు అంబులెన్సు లోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ పోలీసు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అంబులెన్సు లో బేసిక్ లైఫ్ సపోర్ట్ తో పాటు వ్యాక్యూమ్ సక్షన్, 5 పారా ఈ.సి.జి మానిటర్, డి ఫిబ్రిలేటర్, ఇన్ఫ్యూషన్ సెట్, ఇంజక్షన్ సెట్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సౌకర్యాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, ఆర్.ఐ మహబూబ్ బాషా, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *