అనపర్తి నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి…

అనపర్తి నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి…
నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వరుపుల
అనపర్తి – రాష్ట్ర పార్టీ అదేసాల మేరకు అనపర్తి నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలకు కన్వీనర్ల నియామకం పూర్తి చేయడం జరిగిందని నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పరుపుల సుబ్బారావు తెలియజేశారు.
ఆదివారం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన అనపర్తి మండల పార్టీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు)తో కలసి నియోజకవర్గస్థాయిలోని సచివాలయాల కన్వీనర్ల నియామకాలపై తుది పరిశీలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, సేవా తత్పరత ఉత్సాహం కలిగిన కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరిగిందన్నారు. కన్వీనర్ లుగా ఖరారు చేసిన వారి పేర్లను ప్రకటించారు. ఈ జాబితాను రాష్ట్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుందని వరుపుల ఈ సందర్భంగా తెలియజేశారు….
Source : Satti Ramakrishna Reddy-ysrcp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *