పట్టణం పరిశుభ్రంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పట్టణం పరిశుభ్రంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు

స్వచ్ సర్వేక్షన్ 2023 లో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 2 వార్డులో గౌరవ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు స్వయంగా ఖాళీ స్థలంలోని ప్లాస్టిక్ కవర్లు మరియు చెత్తను స్వయంగా తొలగించడం జరిగింది.

ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో పట్టణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని అందుకొరకు వార్డులోని ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఇండ్లలో వెళ్లే తడి పొడి చెత్తను వేరుచేసి ప్రతిరోజు వచ్చే మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందించాలని అలాగే ఇంట్లోని గాజు సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వస్తువులు జమచేసి వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం రోజు మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు.

వార్డులోని యువకులు పెద్దమనుషులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ వార్డుల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు మున్సిపల్ మెప్మా ఆర్పీల సహాయంతో ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఇంటి యజమానులకు తెలియజేయాలని అన్నారు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ కౌన్సిలర్ పస్తం హనుమంతు,

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు,మేనేజర్ శివప్రసాద్ గారు,ఏఈలు సతీష్, మనోహర్,మున్సిపల్ సిబ్బంది మరియు ఉప్పు రాజ్ కుమార్ వారి మిత్రులు,స్వచ్ఛంద సంస్థ యువకులు వార్డ్ ప్రజలకు గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ దాసరి మమత రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క వార్డులో వార్డ్ కౌన్సిలర్ సహకారంతో ఓపెన్ ప్లాట్ లోని చెత్తాచెదారం తొలగించడం జరుగుతుందని అలాగే రోడ్ల వెంబడి మురికి కాలువలో ఓపెన్ ప్లాట్ లలో చెత్త వేసినట్లయితే జరిమానాలు విధించడం జరుగుతుందని ఒకవేళ చెత్త వేస్తున్నప్పుడు వేసే వ్యక్తి యొక్క ఫోటోలు తీసి కమిషనర్ నంబర్ 9100902361 పంపినట్లయితే తగిన పారితోషకం కల్పించడం జరుగుతుందని అన్నారు అలాగే ఓపెన్ ప్లాట్ లలో ఉన్నటువంటి ముళ్ళ చెట్లను వెంటనే తొలగించాలని లేనియెడల వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు ఇండ్లలో కిరాయి ఉండే వ్యక్తులు మా మున్సిపల్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త వేరుచేసి ఇచ్చే విధంగా ఇంటి ఓనర్లు సహకరించాలని కోరారు పెద్దపల్లి పట్టణాన్ని చెత్తరహిత ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో పెద్దపల్లి పట్టణాన్ని ముందుంచే క్రమంలో మీ వంతు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో 2 వార్డ్ కౌన్సిలర్ పస్తం హనుమంతు, మున్సిపల్ మేనేజర్ శివ ప్రసాద్ గారు, ఏఈలు సతీష్ గారు, మనోహర్ గారు,టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్ గారు, మున్సిపల్ మెప్మా ఆర్పీలు, మరియు పట్టణంలోని యువకులు వార్డు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *