Kadapa : ఉపముఖ్యమంత్రి స్వగృహం కార్యకర్తలతో ఎప్పుడు కల కల…

By
ఉపముఖ్యమంత్రి స్వగృహం కార్యకర్తలతో ఎప్పుడు కల కల…
దానికి 100 మీటర్ల దూరంలో ఉన్న సందులోని పారిశుద్యం ఇలా విల విల…
కడప నగర నడిఒడ్డులో ఉన్న వీరాస్వామి మండి వీధి ఇప్పుడు రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది…
కాలువ కొట్టారు బాగుంది,పూడిక తీశారు బాగుంది మరి దాన్ని ఎత్తేందుకు నిర్లక్ష్యం ఎందుకు ???
డెంగ్యూ స్వైరవిహారం చేసే రోజులలో రోడ్లలో కాల్వ పూడిక తీసి అలానే రోజుల తరబడి ఉంచి అక్కడ ప్రజల ఆరోగ్యంతో కడప మునిసిపల్ కార్పొరేషన్ నాయకులు,అధికారులు చెలగాటం ఆడటం చాలా బాధాకరం…
ప్రతిరోజు వేల మంది ప్రజలు ఆ వీధిలో వెళ్తుంటారు,అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు,
డెంగ్యూ జ్వరం వస్తే లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది,ప్రజల ఆరోగ్య హక్కును కాలరాయకండి…
వీరాస్వామి మండి వీధి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి,అక్కడి ప్రజలు హాస్పిటల్ పాలు కాకుండా తగిన చర్యలు తీసుకుని ఆ సందులోని రోడ్ల పై ఉన్న కులువ వ్యర్ధాలను వెంటనే శుభ్రం చేయాలని కడప మునిసిపల్ కార్పొరేషన్ నాయకులను,అధికారులను కోరుతున్నాను.
మీ
ప్రేశ్నించే గొంతుక
పట్టుపోగుల పవన్ కుమార్.

Leave a Comment

Your email address will not be published.

You may also like