తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని గౌరవ యం.యల్.సి శత్రుచర్ల పిలుపునిచ్చారు
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయండి..
గౌరవ యం.యల్.సి శత్రుచర్ల విజయరామరాజు..
కురుపాం నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని గౌరవ యం.యల్.సి శత్రుచర్ల విజయరామరాజు గారు పిలుపునిచ్చారు మంగళవారం నాడు చినమేరంగి గౌరవ యం.యల్.సి వారి నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు యూనిట్ ఇన్చార్జులు బూత్ ఇన్చార్జులు క్లస్టర్ ఇన్చార్జిలకు ఆర్.టీ.యస్. పై ఒక్కరోజు శిక్షణ శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ యం.యల్.సి వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కురుపాం నియోజకవర్గంలో బలోపేతంగా ఉందని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేస్తే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి జగదీశ్వరి గారు మాట్లాడుతూ సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ నియమించిన వివిధ విభాగాల ఇన్చార్జులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆమె కోరారు. ఈ శిక్షణ శిబిరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల పార్టీ ఇన్చార్జిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News:
Congress government in Punjab has increased the procurement rates for Paddy by 34% and Wheat by 26%.
2వ రోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी ने महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू से मुलाकात की !!
మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కవులూరు గ్రామం బాదుడే - బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నాను
TRS Party : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల...
సాంకేతికత ఉపయోగించి దోపిడి కేసును చాకచక్యంగా చేధించిన రేపల్లె రూరల్ సర్కిల్ పోలీస్
Nice news
Fabulous