ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఏలేశ్వరం పోలీసులు

ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఏలేశ్వరం పోలీసులు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే ఖచ్చితమైన సమాచారం మేరకు ది.22-11-2021 పెద్దాపురం DSP A శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ప్రత్తిపాడు ఇంచార్జి CI కె. కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం SI విద్యా సాగర్ గారు వారి సిబ్బందితో ఏలేశ్వరం మండలం, యర్రవరం పంచాయతీ పరిధిలో పెద్దనాపల్లి వెళ్ళే దారిలో శ్రీ బాలాజీ కంప్యూటర్ వేయింగ్ Bridge వద్ద పాసింజర్ ఆటోలో ప్రయాణికుల ముసుగు లో Travelling లగేజ్ బ్యాగ్లలో విశాఖ ఏజెన్సీ నుండి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 10 మంది వ్యక్తులలో 6 గురు వ్యక్తులు పరారు కాగా 4 గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 60,000 విలువైన 30 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీన పరచుకున్న ప్రోపర్టీ వివరాలు:
1) 30 KGల గంజాయి(విలువ సుమారు 60,000)
2) ఒక ఆటో నెం. AP39 TG 1652
3) బజాజ్ పల్సర్ బైక్ నెం. AP 39 LH 2212
4) 4 సెల్ ఫోన్లు

Source : East Godavari Police, Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *