దేశానికి వెన్నుముక రైతన్న | రైతు శ్రేయస్సు…దేశ శ్రేయస్సు
ఈ నెల 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో జనసేన పార్టీ నాయకులు డా.రవికుమార్ మిడతాన ఆధ్వర్యంలో రైతుల చేతుల మీదుగా జాతీయ రైతు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జనసేన అధ్యక్షులు కౌలు రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు, వారి కుటుంబాలను ఆదుకుంటున్న తీరును రైతులకు వివరించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నంపెట్టే అన్నదాతను సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీ పిట్ట బాలు, శ్రీ రాంబాబు చౌడువాడ, శ్రీ చిన్ని కృష్ణ, శ్రీ పొట్నూరు చంటి, శ్రీ కిలా బాలాజీ, శ్రీ గుద్దుల ఈశ్వరరావు, శ్రీ సుంకరి కోటి, శ్రీ కోరాడ గణేష్, శ్రీ కె. దాసు, శ్రీ పడాల శివకుమార్, శ్రీ పైడిరాజు, శ్రీ అప్పన్న దొర, శ్రీ నాగిరెడ్డి కాళీ, శ్రీ సత్తిబాబు రుద్ర, శ్రీ పసుమర్తి సాయి, శ్రీ నాగు బిల్లి శంకర్రావు, శ్రీ దాట్ల గంగరాజు, శ్రీ గారి గౌర్నాయుడు, శ్రీ పిట్ట రఘు, శ్రీ వారబోయిన గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Source : Janasena Shatagni
Sreyassu