రహదారులు బాగుంటే నాగరికత పెరుగుతుంది

రహదారులు బాగుంటే నాగరికత పెరుగుతుంది…
ఏడాది లోపు పూర్తి చేసి పరిహారిన్ని అందజేసేలా చూస్తాం…
ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
రహదారులు బాగుంటే నాగరికత పెరుగుతుందని ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం లక్కిరెడ్డిపల్లెలో జరిగిన సమావేశంలో ఎన్.హెచ్ 440 రోడ్డు విస్తరణలో భాగంగా గృహాలు కోల్పోతున్న వారితో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప, రాజంపేట ఎంపీలు వై.యస్.అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషితోనే రాయచోటి నుండీ చాగలమర్రి వరకు రోడ్డు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటికే రూ.426 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేసేలా ఎన్.హెచ్.అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఇప్పటికేనియోజకవర్గంలోని అన్ని మండలాలల్లో కూడా నాలుగు లైన్ల రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇళ్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోతున్న వారిని దృష్టిలో ఉంచుకొని వారికి తమ వంతుసహకారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. ఎక్కడ కూడా స్వార్ధం లేకుండా రెవెన్యూ రికార్డుల ఎఫ్.ఎం.బీ ప్రకారమే లక్కిరెడ్డిపల్లెలో కూడా 28 మీటర్ల మేర రోడ్ ను సర్వీస్ రోడ్ తో చేసేలా ఎన్.హెచ్.అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాలల్లో కూడా నాలుగు లైన్ల రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.ఇళ్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోతున్న వారిని దృష్టిలో ఉంచుకొని వారికి తమ వంతు సహకారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
ఎక్కడ కూడా స్వార్ధం లేకుండా రెవెన్యూ రికార్డుల ఎఫ్.ఎం.బీ ప్రకారమే లక్కిరెడ్డిపల్లెలో కూడా 28 మీటర్ల మేర రోడ్ ను సర్వీస్ రోడ్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ మేరకు 24 మీటర్ల కు రోడు కుదించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళతామని అన్నారు. రోడ్ సెంటర్ నుండీ మాత్రమే కొలతలు వేసి విస్తరణ పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.440 ఈఈ ఓబుల్ రెడ్డి, ఎ.ఈ.పద్మనాభం, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ అమీర్, వ్యవసాయ శాఖ జిల్లా సలహ మండలి సభ్యులు రవిరాజు, సర్పంచ్ లు వెంకటనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ రాజారెడ్డి, ఎంపీడీఓ విజయ రాఘవ రెడ్డి, తహశీల్దార్ తులశమ్మ, వైయస్సార్సీపీ నాయకులు నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *