భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు, మరి కొన్ని దారి మళ్లింపు.

By
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు, మరి కొన్ని దారి మళ్లింపు..
సికింద్రాబాద్‌: భారీ వర్షాల కారణంగా ఇవాళ పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తడ – సూళ్లూరుపేట మార్గంలో ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తున్న కారణంగా ఆ మార్గంలో ఈరోజు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రీ షెడ్యూల్‌ చేయగా… మరికొన్ని దారి మళ్లించారు.
దారి మళ్లించిన రైళ్లు..
త్రివేండ్రం – షాలిమర్, ముంబై సీఎస్‌టీ – చెన్నై సెంట్రల్‌, తిరుపతి – హెచ్.నిజాముద్దీన్, కాచిగూడ – మంగళూరు, బెంగళూరు – గువహటి, చెన్నై సెంట్రల్ – హెచ్.నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ – హౌర, చెన్నై సెంట్రల్ – విజయవాడ, నందలూరు – రాజంపేట మధ్య నడిచే 12 రైళ్లు దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
*రద్దు చేసిన రైళ్ల వివరాలు..*
ఇవాల్టి తిరుపతి – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – ముంబై సీఎస్‌టీ, గుంతకల్ – రేణిగుంట, బిట్రగుంట – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – బిట్రగుంట రైళ్లు, విజయవాడ – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – విజయవాడ రైళ్లు రద్దు చేశారు. నందలూరు – రాజంపేట మధ్య రైలు పట్టాలపై ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న వరద నీరు కారణంగా ఇవాళ ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా, మరికొన్ని దారిమళ్లించారు. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్, కాచిగూడ – చెంగల్పట్టు, ఎల్.టి.టి ముంబై – చెన్నై సెంట్రల్, సీఎస్‌టీ ముంబై – నాగర్ సోల్, మధురై – ఎల్‌టీటీ ముంబై, చెంగల్పట్టు – కాచిగూడ, చెన్నై సెంట్రల్ – ఎల్‌టీటీ ముంబై రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Leave a Comment

Your email address will not be published.

You may also like