అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు

అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు…
ప్రజాసంఘాల దీక్షలను సందర్శించి హామీ ఇచ్చిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.రాయచోటి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకోసం ప్రజాసంఘాలు చేస్తున్న దీక్షలను సోమవారం ఆయన సందర్శించారు.ప్రజా సంఘాల నాయకులతో ఆయన చర్చించారు.ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చిత్తశుద్దితో ఉన్నామన్నారు. తహసీల్దార్ కార్యాలయం పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు కోరడంతో ప్రభుత్వ కార్యాలయ సముదాయాల అధికారులందరితో సమన్వయం చేసుకుని విగ్రహ ఏర్పాటు విషయం చర్చించుదామన్నారు. తల్లి దండ్రుల తరువాత వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, భేషజాలకు పోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో, అందరి అనుమతితో సుందరంగా ఆ మహనీయుని విగ్రహాన్ని సమిష్టిగా ఏర్పాటు చేద్దామన్నారు. జిల్లా కేంద్రంమైన రాయచోటిలో అంబేద్కర్ విగ్రహంతో పాటు మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం విగ్రహాలను త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని, ఇందుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందన్నారు.అంబేద్కర్ చిత్రపట ప్లెక్సీ చినిగిందని, విగ్రహానికి ఏమైనా నష్టం జరిగివుంటుందని ప్రజా సంఘాలు ఎంఎల్ఏ దృష్టికి తీసుకురావడంతో చిరిగిన ఫ్లెక్సీ స్థానంలో నూతన ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. విగ్రహానికి ఏమైనా అయిందా అని ప్రజాసంఘాల సమక్షంలోనే తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి ని శ్రీకాంత్ రెడ్డి అడగ్గా, విగ్రహానికి ఎటువంటి చిన్నగీత పడకుండా భద్రపరచామని తెలిపారు. ఈ విగ్రహాన్ని ప్రజాసంఘాల నాయకులకు కూడా చూపించాలని రెవెన్యూ,పోలీసు అధికారులుకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మనమందరం స్వేచ్ఛగా ఉండడానికి కృషి చేయడంతో పాటు అంటరానితనం, అసమానత లు లేని సమాజం కోసం పాటుపడిన మహనీయులు డా బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఇటీవల వచ్చిన జై భీం సినిమాను చూశామని, ఈ కాలంలో కూడా ఇటువంటివి జరుగుచున్నాయి, వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తులలో తానొకరినన్నారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన అంశాలుపై కొంతమంది ఐ ఏ ఎస్ అధికారులు నా దగ్గరికి వచ్చి మంచి అంశాలను మాట్లాడారని తమకు అభినందనలు కూడా తెలిపారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఎటువంటి నిర్ణయాలను తాము ఎప్పుడూ వ్యతిరేకించమన్నారు. ప్రతి ఒక్కరమూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని,ఇక్కడ జరిగిన సంఘటనపై అధికారులు ఇచ్చిన నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రజల కోసం మంచిచేస్తున్న ప్రజాసంఘాలుకు తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, మదన మోహన్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష,జాకీర్, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్,రియాజ్, షబ్బీర్, జానం రవీంద్ర యాదవ్, ఇర్ఫాన్,మురికినాటి వెంకట్రామిరెడ్డి, అన్నా సలీం, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చుక్కా అంజనప్ప,వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,శంకర్ రెడ్డి అజ్మతుల్లా ఖాన్,కో ఆప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ,మూసా,జావీద్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
Source : YSRCP Annamayya District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *