ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన నలుగురు లబ్దిదారులకు రూ 3.10 లక్షలు విలువ చేసే చెక్కులును మంగళవారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. లక్కిరెడ్డిపల్లె మండలం సి కె పల్లెకు చెందిన కమ్మెటి సావిత్రమ్మకు రూ 60 వేలు,రాయచోటి మండలం పెమ్మాడపల్లె మొరవవడ్డెపల్లెకు చెందిన కోటకొండ వెంకటేశ్వర్లుకు రూ 20 వేలు,రామాపురం మండలం పొత్తుకూరుపల్లె కొండ్రేడ్డిగారిపల్లెకు చెందిన పూతిరెడ్డి సుబ్బారెడ్డి కి రూ1.20 లక్షలు, మున్సిపాలిటీ లోని రెడ్డివారిపల్లె కు చెందిన దండు శివమ్మకు రూ 1.10 లక్షలు విలువ చేసే చెక్కులును శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.
లబ్ధిదారుల కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారాన్ని మరువలేమని సీఎం సహాయనిది చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పేర్కొన్నారు. తమకు ఆరోగ్యాలు బాగలేక,వైద్యానికి అప్పులు చేసి ఖర్చులు పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకుందన్నారు. తమకు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్ కు, అందుకు సహకరించి కృషిచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి లకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ రెస్కో చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి,వైఎస్ఆర్ సిపి మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, కో ఆప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *