కుప్పంలో మునిసిపల్ అధికారులు జయమ్మ అనే ఓ దళిత మహిళ షాపుపై దౌర్జన్యం చేయడం దారుణం

కుప్పంలో మునిసిపల్ అధికారులు జయమ్మ అనే ఓ దళిత మహిళ షాపుపై దౌర్జన్యం చేయడం దారుణం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వ హయాంలో సాయం పొందిన జయమ్మ టెంట్ హౌస్ నిర్వహిస్తూ, మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు షాపులకు అద్దె కడుతున్నారు. ఖాళీగా ఉన్న మరో షాపు వద్ద మెటీరియల్ పెట్టుకున్నారు
అధికారులు దీన్నే పెద్ద నేరంగా చూపించి ఆమె సామగ్రి బయట పడేశారు. చిన్న వ్యాపారం పెట్టుకుని బతుకుతున్న ఒక దళిత మహిళ పైన కక్ష చూపడం ఈ ప్రభుత్వ దురహంకార వైఖరికి నిదర్శనం. కనీసం నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేయించడం నీచమైన చర్య.
: Nara Chandrababu Naidu (TDP President)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *