బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు

కడప జిల్లా :
 బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ఓటు హక్కును వినియోగించు కోవడానికి ప్రజలు భారీగా వస్తున్నారని తెలిపారు.
బయటి ప్రాంతాల వ్యక్తులు నియోజకవర్గం లోకి రాకుండా బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా 14 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం..చెక్ పోస్ట్ ల వద్ద సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
281 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతం గా పోలింగ్ జరుగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛ గా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎక్కడైనా సమస్య ఉంటే డయల్ 100 కు కానీ లేదా తన ఫోన్ నంబర్ 9440796900 కు ఫోన్ చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *