ప్రమాదంలో ఉన్న ఎర్ర కట్ట బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేయాలి…

By
ప్రమాదంలో ఉన్న ఎర్ర కట్ట బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేయాలి…
విజయవాడ వన్ టౌన్ ప్రజలకు, స్నేహితులకు చిన్న గమనిక. ఎర్ర కట్ట బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. బ్రిడ్జికి రెండు వైపులా సపోర్ట్ గా ఉన్న గోడలు బీటలు వారాయి… రైల్వే వారు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ… బ్రిడ్జ్ కింద నుండి వెళ్లే దారిని రెండు వైపులా మూసివేశారు.
దీంతో పంజా సెంటర్ నుండి ఎర్రకట్ట మీదుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెట్రోల్, డీజిల్ అదనంగా ఖర్చు అవుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మరింత భారంగా మారింది.
కావున వెంటనే ఈ ఎర్రకట్ట బ్రిడ్జి మరమ్మతులను చేస్తే, వాహనదారుల పెట్రోల్, డీజిల్ భారాలను తగ్గుతాయి, టైమ్ ను ఆదా చేసేందుకు ఉపయోగపడుతుంది..

Leave a Comment

Your email address will not be published.

You may also like