గంజాయి అక్రమ రవాణాపై నమోదైన 44 కేసుల్లోని Rs.96,00,000/- విలువ చేసే 632 KG ల గంజాయిని రాయచోటి నగర శివార్లలో ధ్వంసం
అన్నమయ్య జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాపై నమోదైన 44 కేసుల్లోని Rs.96,00,000/- విలువ చేసే 632 KG ల గంజాయిని రాయచోటి నగర శివార్లలో ధ్వంసం చేసిన జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు . గంజాయి అక్రమ రవాణా చేస్తూ/ విక్రయిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని లేక విక్రయిస్తున్నారని ఎవరైనా సమాచారం ఇస్తే అట్టి వారి వివరాలు గోప్యముగా వుంచబడునని జిల్లా ఎస్.పి గారు తెలియజేసారు.
Source : Annamayya District Police