అనంతపురం జిల్లాలో పారదర్శకంగా ప్రారంభమైన కానిస్టేబుళ్ల బదిలీలు

అనంతపురం జిల్లాలో పారదర్శకంగా ప్రారంభమైన కానిస్టేబుళ్ల బదిలీలు
* ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం బదిలీలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు
* ఖాళీల వివరాలను ” ఎక్స్ ఎల్ షీటు” ద్వారా బదిలీకు అర్హులైన సిబ్బందికి ముందే పంపిన జిల్లా పోలీసుశాఖ
* 30-05-22 తేదీ నాటికి 5 సంవత్సరాలు పూర్తీ అయిన కానిస్టేబుళ్లను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలుకు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహణ
* బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలు సిబ్బందికి స్పష్టంగా వివరించిన జిల్లా ఎస్పీ … అంతేకాకుండా…ఒకే చోట ఐదేళ్లు పూర్తీ చేసుకున్న సిబ్బంది సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్‌ పై ప్రదర్శింపజేశారు.
* 40 శాతం, ఆపై వికలాంగత్వం ఉన్న వారు, మానసిక రోగంతో బాధపడుతున్న పిల్లలు కల్గిన వారు, ఓపెన్ హార్ట్ సర్జరీ , కిడ్నీల మార్పిడి, స్పౌజ్ కేసులకు ప్రాధాన్యత క్రమంలో బదిలీలు చేశారు
* నేటివ్ మండలంలోని పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న వారు అదే మండలంలోని పోలీసు స్టేషన్లకు కాకుండా మరియు టౌన్ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న వారు టౌన్ కాకుండా రూరల్ పోలీసు స్టేషన్లకు… రూరల్ లో పని చేస్తున్న వారు టౌన్ కు ప్రాధాన్యతనిచ్చారు
* ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా ఖాళీల వివరాలను ఎక్స్ ఎల్ షీటు ద్వారా ముందే సిబ్బందికి పంపి కౌన్సెలింగ్ ద్వారా బదిలీతో పాటు అక్కడికక్కడే డి.ఒ కాఫీలను అందజేసి బదిలీల ప్రక్రియ యావత్తు పారదర్శకంగా నిర్వహిస్తుండటంతో పోలీసు సిబ్బంది నుండీ హర్షం వ్యక్తమయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *