నెరవేరిన ఉడుంవారిపల్లె ప్రజల చిరకాల కోరిక.

నెరవేరిన ఉడుంవారిపల్లె ప్రజల చిరకాల కోరిక…
రూ 2.30 కోట్ల నిధులుతో నిర్మాణాలు పూర్తయిన ఉడుంవారిపల్లె కాజ్ వే ను మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డితో కలసి ప్రారంభించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డ
ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో ఉడుంవారిపల్లె ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.రామాపురం మండలంలోని రామరాజువంక కాజ్ వే అధిక వర్షాల వల్ల కొట్టుకుపోవడంతో ఉడుంవారిపల్లె, సరస్వతిపల్లె, నాయునివారిపల్లె, హరిజనవాడ తదితర పల్లెలకు రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో అనతికాలంలోనే కాజ్ వే నిర్మాణాలకురూ 2.30 కోట్ల నిధులును మంజూరు చేయించి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభింపచేసి పూర్తిచేయించారు. మంగళవారం నాడు ఉడుంవారిపల్లె కాజ్ వే ను మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డితో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.పనులను త్వరితగతిగా, నాణ్యతగా పనిచేసిన అధికారులును, కాంట్రాక్టర్ ను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.
ప్రజల కృతజ్ఞతలు…
కాజ్ వే నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పనులుపూర్తిచేయించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి ఉడుంవారిపల్లె, నాయునివారిపల్లె, సరస్వతిపల్లె, హరిజనవాడ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఎంపిపి లు జనార్దనరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాధ రెడ్డి, వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి,సూరం వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ మునీర్ బాష, పి ఐ యు ఎస్ ఈ సురేష్, డి ఈ గోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ హరినాథరెడ్డి,వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, దామోదర్ నాయుడు, కదిరప్ప నాయుడు, శ్రీధర్ రెడ్డి, సలాం, ఖాదర్ వలీ, హీరాన్ బాష, దర్బార్ బాష, గౌస్, నాగులయ్య,కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Source : YSRCP Annamayya District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *