పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా ఉంటాం..

By
పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా ఉంటాం…
వై ఎస్ ఆర్ వెలిగల్లు ప్రాజెక్ట్ సందర్శనలోప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా ఉంటామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం గాలివీడు మండలం లోని వైఎస్ఆర్ వెలిగళ్లు ప్రాజెక్టును స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులుతో కలసి సందర్శించారు. ప్రాజెక్ట్ వరద ఉధృతిని పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ వెలిగల్లు ప్రాజెక్ట్ నిండు కుండలా ఉందని, నిన్న ఒక రోజుల్లోనే 75 వేల క్యూసెక్కుల నీటిని, నేడు 30 వేల క్యూసెక్కులు నీటిని , రెండు మూడు నెలల నుంచి 20 టి ఎం సి ల నీటికి పైగా పాపాగ్ని ద్వారా పెన్నా లోకి విడుదల చేయడం జరిగిందన్నారు.420 మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం 419 మీటర్ల మేర నీరు నిల్వ ఉందన్నారు.ఈ ప్రాజెక్ట్ లోకి 4.5 టి ఎం సి ల నీరు చేరడం కష్టం అనుకున్న నేపథ్యంలో 30 టి ఎం సి ల నీటిని బయటకు పంపడం జరిగిందన్నారు.ఈ ప్రాంత ప్రజలకు ప్రాజెక్ట్ ఒక వరమన్నారు.రబీలో నష్టపోయిన రైతులకు చిరు ధాన్యాలను రైతు భరోసా కేంద్రాలలో పంపిణీ చేస్తున్నారన్నారు.వెలిగల్లు గ్రామంలోని పొలాలకు వెళ్లే దారి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపుతామన్నారు.
ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆవుల నాగభూషన్ రెడ్డి, మండల వైకాపా నాయకులు మిట్టపల్లి యదుభూషన్ రెడ్డి, తాసీల్ధార్ శ్రావణి,ఎంపిడిఓ శేఖర్ నాయక్,ఎస్సై చిన్నపెద్దయ్య, సర్పంచలు ఉమాపతి రెడ్డి, కేశవరెడ్డి, ఇందుకూరి ఉమామహేశ్వరి, జానకమ్మ, షేక్ నఫీస్,బావా ఫక్రుద్దీన్ , కృష్ణారెడ్డి, గుమ్మా అమర నాధ రెడ్డి, రమణా రెడ్డి పలువురు ఎంపిటిసిలు,వైకాపా నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Source : Rayachoti Media

Leave a Comment

Your email address will not be published.

You may also like